అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్లో ఘనంగా దసరా వేడుకలు: ముఖ్య అతిథిగా పాల్గొన్న కంది శ్రీనివాస రెడ్డి
ఆదిలాబాద్ డైట్ కళాశాల మైదానంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన దసరా వేడుకలకు కాంగ్రెస్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయం దసరా అని పేర్కొన్నారు.