కూని తోపు వద్ద గుర్తుతెరిని యువకుడు దారుణ హత్య.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి. కొత్తకోట, మండలం గొల్లపల్లె పంచాయతీ కూని తోపు సమీపంలో గుర్తు తెలియని సుమారు 25 సంవత్సరాల గల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.. ఘటన శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో వెలుగులో వచ్చింది.