ప్రజల నుంచి వచ్చే అర్జీలను అధికారులు వెంటనే పరిష్కరించాలి: యద్దనపూడి జగనన్నకు చెబుదాంలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
ప్రజల నుంచి వచ్చే అర్జీలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. యద్దనపూడి మండలం ముద్దన హనుమయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం బుధవారం జరిగింది. ప్రజలు క్షేమంగా ఉండాలంటే అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. అనంతవరం, యనమదల గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు మెరుగుపరచాలన్నారు. జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో 165 దరఖాస్తులు రాగా 160 పరిష్కరించడంపై అధికారులను కలెక్టర్ అభినందించారు. 9 అర్జీలు పునరావతం కావడంపై ఆరా తీశారు.