నాంపల్లి: మండల కేంద్రంలోని ఆగ్రోస్ సేవా కేంద్రం, మన గ్రోమోర్ వద్ద యూరియా కోసం సాయంత్రం వరకు నిరీక్షించిన రైతులు
నల్గొండ జిల్లా, నాంపల్లి మండల కేంద్రంలోని ఆగ్రోస్ సేవ కేంద్రం, మన గ్రోమోర్ వద్ద రైతులు ఉదయం నుండి యూరియా కోసం సాయంత్రం వరకు బారులు తీరారు. మంగళవారం సాయంత్రం పలువురు రైతులు మాట్లాడుతూ.. యూరియా కోసం ఉదయం నుండి సాయంత్రం వరకు పడి కాపులు కాస్తే యూరియా దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కేంద్రంలో ఒక బస్తా, మరో కేంద్రంలో రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. యూరియా కోసం రోజుల తరబడి నిలబడాల్సి వస్తుందని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరిపడా యూరియా సరఫరా చేసి యూరియా కష్టాలు తీర్చాలని కోరారు.