కామారెడ్డి: సిఐటియు ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు : జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్
కామారెడ్డి : తెలంగాణ అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మినిస్టర్ ల ఇళ్ల ముందు ధర్నా చేయాలని పిలుపునివ్వడం జరిగిందని సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంటిని అంగన్వాడి టీచర్లు ముట్టించడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు నడుస్తుందన్నారు. ఎన్నికల మేనిఫెస్టో లో అంగన్వాడీ మినీ అంగన్వాడి లకు కనీస వేతనం 18 వేల రూపాయలు ఇస్తామని pf, esi సౌకర్యం కల్పిస్తామని ఇప్పటివరకు కనిపించలేదని తెలిపారు.