నీటి వద్ద ఆడుకునేందుకు వెళ్లి నీటిలో పడి చిన్నారి మృతి
Anantapur Urban, Anantapur | May 11, 2026
అనంతపురం నగర శివారులోని టీవీ టవర్ సమీపంలో ఉన్న అంబేద్కర్ నగర్ సమీపంలోని పెద్ద కాలువ వద్ద నీట మునిగి ఏడేళ్ల చిన్నారి కృష్ణవేణి భాయ్ మృతి చెందిన ఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. దీంతో గమనించిన స్థానికులు హుటాహుటిన పెద్ద కాలువ వద్ద చేరుకొని నీట మునిగిన చిన్నారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.