హత్నూర: కాసాలలో అప్పుల బాధతో ఒకరు ఆత్మహత్య
అప్పుల బాధతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా కాసాల గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. హత్నురా ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కాసాల గ్రామానికి చెందిన పాముల సురేష్ వ్యవసాయం కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక సతమతమయ్యేవాడని భార్య శ్రీలత పేర్కొంది. అప్పుల ఒత్తిడి ఎక్కువై సురేష్ సూసైడ్ చేసుకున్నట్టు పేర్కొన్నారు. మృతుడి కి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.