కరీంనగర్: దాసరి శేఖర్ అనే డాన్స్ మాస్టర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం, చికిత్స పొందుతూ మృతి
రామడుగు మండలం గోపాల్ రావు పేటకు చెందిన దాసరి శేఖర్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయగా కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బుధవారం కుటుంబ సభ్యులు తెలిపారు. ఓ ప్రైవేట్ పాఠశాలలో డ్యాన్స్ మాస్టర్ గా పనిచేస్తున్న శేఖర్ కు వివాహం జరిగిందని, ఈ క్రమంలో పిల్లలు పుట్టటం లేదని మనస్తాపం చెంది, మరోవైపు ఆర్థిక పరిస్థితులను నేపథ్యంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా ఆసుపత్రికి తరలించామని, చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని,ఫిర్యాదు అనంతరం కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.