చోడవరంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక షాపు దగ్ధం ,15 లక్షల ఆస్తి నష్టం
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోగల చోడవరం పట్టణంలో ఉషశ్రీ ఎలక్ట్రానిక్ షాప్ లో అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం నాడు జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో 15 లక్షల వరకు నష్టం సంభవించిందని షాపు యజమానులు చెప్తున్నారు. అగ్గిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని షాపు యజమానులు వాపోతున్నారు.