నందికోట్కూరు: మోసం చేసిన కేసులో వ్యక్తి అరెస్ట్ : కార్ నగదు సీజ్: మిడుతూరు ఎస్ఐ ఓబులేష్
ప్రజలను మోసం(చీటింగ్)చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు మిడుతూరు ఎస్సై హెచ్ ఓబులేష్ సోమవారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు మేరకు నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రానికి చెందిన లొద్దిపల్లె శివ కుమార్ అనే వ్యక్తి ఒక లక్ష రూపాయలకు అధికంగా 40 వేల రూ.లు మీకు వడ్డీ ఇస్తానని చెప్పి ప్రజలను నమ్మించి వారి వద్ద నుండి మొత్తం 25 లక్షల రూపాయలు తీసుకున్నట్లు బాధితుడు వాడాల గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని మిడుతూరులో బ్రహ్మంగారి మఠం దగ్గర శివకుమార్ ను అరెస్ట్ చేసి అతనికి వద్ద నున్న (టియువి ఏపి 07 సివై 4298)అను నంబర్ గల కార్ ను మరియు