తాడిపత్రి: తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్ర సమీపంలో డ్రైనేజీ పైప్లైన్ మరమ్మత్తు పనులను చేపట్టిన అధికారులు
తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవస్థానం సమీపంలో ఉన్న రజక కళ్యాణమండపం వద్ద నెలకొన్న డ్రైనేజీ సమస్యను ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్తీక మాసంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు, ఆయన డ్రైనేజీ పనులను యుద్ధ ప్రాతిపదికన యంత్రాల సహాయంతో చేయిస్తున్నారు. పనులు జరుగుతుండడంపై భక్తులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.