డోన్: బేతంచర్లలో రౌడీ శీటర్లను హెచ్చరించిన సిఐ వెంకటేశ్వరరావు
Dhone, Nandyal | May 17, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న రౌడీషీటర్లు గ్రామాల్లో ఘర్షణలకు, అల్లర్లకు పాల్పడితే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని సీఐ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఆదివారం బేతంచెర్ల పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. రౌడీ షీటర్లు నేరాలకు దూరంగా ఉంటూ ప్రశాంత జీవనం గడపాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.