లక్కీరెడ్డిపల్లి, దప్పేపల్లి గ్రామాలకు చెందిన సుమారు 80 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. గ్రామ సర్పంచ్ కేశవప్ప, పాలెం మాజీ ఎంపీటీసీ గంగయ్య ఆధ్వర్యంలో బుధవారం రాయచోటిలోని మంత్రి రాంప్రసాద్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో చేరికలు జరిగాయి.మంత్రి స్వయంగా పార్టీ కండువాలు కప్పి నాయకులను, కార్యకర్తలను ఆహ్వానించారు. గత 16 నెలలుగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసంతో టీడీపీ తీర్థం పుచ్చుకున్నామని నాయకులు పేర్కొన్నారు.