సొంత ప్రచారం కోసమే సీఎం చంద్రబాబు రాయచోటి నియోజకవర్గంలో పర్యటన:మాజీ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు
సొంత డబ్బా కొట్టుకోవడానికే చంద్రబాబు పర్యటన జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి పదవిలో 16 సంవత్సరాలు ఉన్న చంద్రబాబు రాయచోటి ప్రాంత అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదని ఆయన ఆరోపించారు.ఈ నెల 12న చంద్రబాబు అన్నమయ్య జిల్లా పర్యటన నేపథ్యంలో స్పందించిన రమేశ్ కుమార్ రెడ్డి, “ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కాకుండా, తనకో పేరు తెచ్చుకోవడానికే ఆయన పర్యటనలు” అని వ్యాఖ్యానించారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమా వెలిగల్లు ప్రాజెక్టు లభించిందని, దీని వల్ల ఈ ప్రాంత ప్రజలు కరువుతో ఉపశమనం పొందుతున్నారని గుర్తుచేశారు.