సత్యవేడు: ఈనెల 26న జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి : సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి
ఈ నెల 26న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయాలని సీపీఐ నాయకులు పి. మురళి సోమవారం తెలిపారు. సత్యవేడు సీపీఐ నియోజకవర్గం కౌన్సిల్ సమావేశం వరదయ్య పాలెంలో కత్తి ధర్మయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీపీఐ జిల్లా కార్య దర్శి మురళి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.