గుంతకల్లు: గుత్తిలోని ఓల్డ్ సీపీఐ కాలనీలో డ్రైనేజీ కాలువలో తాగునీటి పైప్లైన్లు, నీరు కలుషితం అవుతుందని కాలనీవాసులు ఆందోళన
గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ఓల్డ్ సీపీఐ కాలనీ సుంకులమ్మ ఆలయం సమీపంలో డ్రైనేజీ కాలువలో తాగునీటి పైప్లైన్లు వేశారు. అక్కడే స్పాట్ డెలివరీ ట్యాంకు కూడా ఉంది. పైప్ లైన్లు లీకేజీ అయిన సమయంలో తాగునీరు కలుషితం అవుతున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడున్న డ్రైనేజీ కాలువను కూడా రెగ్యులర్గా శుభ్రం చేయడం లేదు. డ్రైనేజీ కాలువలో ఉన్న పైప్లైన్లను పక్కకు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.