కర్నూలు: కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే ప్రతిపాదనలు: కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ పి. విశ్వనాథ్
కర్నూలు నగరాన్ని ఆధునిక సౌకర్యాలతో కూడిన స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు కీలకమైన ప్రతిపాదనను రూపొందిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ తెలిపారు. మంగళవారం ఉదయం 12 గంటలు కర్నూలు సీతారాం నగర్, కొత్తపేట, అశోక్ నగర్‌తో పాటు పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమైన ఏడు అంశాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే ప్రక్రియ జరుగుతోందని, వీటిలో ఫ్లైఓవర్ల నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్డు, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, పచ్చదనం కోసం పార్కుల అభివృద్ధి, యువతలో క్రీడాస్ఫూర్తి