గద్వాల్: గద్వాల: ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం - మంజూరుపై క్లారిటీ ఇచ్చిన సాయి సాకేత్ రెడ్డి
గద్వాల నియోజకవర్గం గట్టు మండలం బలిగేరలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం జరిగింది. ఎమ్మెల్యే తనయుడు సాయి సాకేత్ రెడ్డి గారు పాల్గొని ఇళ్లను ప్రారంభించారు. నియోజకవర్గంలో మొదటి విడతలో 3500 ఇళ్లు మంజూరు అయ్యాయని, త్వరలో రెండో విడతలో కూడా అర్హులకు ఇళ్లు అందిస్తామని స్పష్టం చేశారు.