ఉరవకొండ: హావలిగి గ్రామంలో కనులపండువగా కడ్లే గౌరమ్మ పూల రథోత్సవం
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హావలిగి గ్రామంలో కడ్లే గౌరమ్మ పూల రథోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కార్తీక మాసంలో ఆచార సంప్రదాయాల్లో భాగంగా గ్రామంలో ఎద్దుల బండి పై ప్రత్యేక పుష్పాలంకరణ చేసిన పూల రథోత్సవంలో కడ్లే గౌరమ్మ అమ్మవారిని కొలువుదీర్చి మంగళ వాయిద్యాల మధ్య గ్రామోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. యువతులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి హారతులను ఇచ్చి చక్కెర నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.