ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీ రూపంలో అందిస్తే పరిష్కరిస్తాం : బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్
బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఎస్పీ ఉమామహేశ్వర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 54 అర్జీలు అందినట్లు సోమవారం ఎస్పీ తెలిపారు. ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలని ఎస్పీ సిబ్బందికి సూచించారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని వివరించారు. వాటి పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు.