ఒంగోలు అర్బన్: మోటార్ సైకిల్ మెకానిక్ ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి పార్లమెంటు దృష్టికి తీసుకు వెళ్తా : ఒంగోలు ఎంపీ మాగుంట
Ongole Urban, Prakasam | Jul 3, 2026
మెకానిక్ డే సందర్భంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి శుక్రవారం మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బైక్ ర్యాలీలో బుల్లెట్ ఎక్కి పార్టిసిపేట్ చేశారు అనంతరం వారు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని స్వీకరించారు అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ వారు కోరినటువంటి కోరికలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు వారి సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని అదేవిధంగా పార్లమెంట్లో కూడా ప్రస్తావించి దేశవ్యాప్తంగా మెకానికులకు సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు