వీణవంక: బెతిగల్ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రాయమల్లు చేన్నమ్మ దంపతులను పోషించాలని కుమారులకు కౌన్సిలింగ్ ఇచ్చిన అడికారులు
వీణవంక: మండలంలోని బేతిగల్ గ్రామలో కంబాల రాయమల్లు చేన్నమ్మ అనే వృద్ధ తల్లిదండ్రులను ఇద్దరు కుమారులు పోషించడం లేదని జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా సంక్షేమ అధికారుల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం విచారణ చేపట్టగా వారు పోషించడం లేదని రాయమల్లు తెలుపడంతో ఇద్దరు కుమారులకు కౌన్సిలింగ్ నిర్వహించి తల్లిదండ్రులను పోషించాలని పోషించని ఎడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కౌన్సిలింగ్ ఇవ్వడంతో ఇద్దరు కుమారుల నుండి 16,000 ఇప్పించారు. దీంతో వృద్ధ దంపతులు అధికారుకు కృతజ్ఞతలు తెలిపారు.