గుంతకల్లు: జనాభా లెక్కల సర్వేను పగడ్బందీగా నిర్వహించాలి: గుత్తిలో మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా
గుత్తి మున్సిపల్ కార్యాలయంలో గురువారం జనాభా లెక్కల సర్వే కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. జనాభా లెక్కల సర్వేను పగడ్బందీగా నిర్వహించాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదన్నారు. ఇంటింటికి వెళ్లి పక్కాగా సర్వే చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రాంబాబు, శిక్షకులు అహోబిలేసు, ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాలు, సూచనలు మేరకు జనాభా లెక్కల సేకరణ చేయాలన్నారు.