అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని రైతు శ్రీనివాసులకు చెందిన వ్యవసాయ తోటలో సోలార్ ప్యానల్ కు అమర్చిన స్టార్టర్ బాక్స్ ను గుర్తుతెలియని దుండగులు శుక్రవారం రాత్రి ధ్వంసం చేసి తనను నష్టపరిచారని బాధిత రైతు శ్రీనివాసులు శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్టార్టర్ బాక్స్ ధ్వంసం చేయడంతో పాటు రెండు ఎకరాల్లోని డ్రిప్ పరికరాలను తగులబెట్టి నష్టపరిచారని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు లక్ష వరకు నష్టం వాటిల్లని తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతు కోరుతున్నాడు.