పుంగనూరు: కోట్లాది రూపాయలతో నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ నుంచి పట్టణ ప్రజలకు చుక్క నీరు ఇవ్వలేని ఘనత వైకాపా నాయకులదే.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో టిడిపి నేత మధు రాయల్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మాట్లాడుతూ సోమల మండలంలో జీడిరేవుల వంక వరద ఉధృతి కారణంగా కొట్టుకోపోయింది అన్నారు. టిడిపి నేత మధుసూదన్ నాయుడు తన సొంత నిధులతో తాత్కాలికంగా జీడిరేవుల వంకను మరమ్మతులు చేసి గ్రామ ప్రజలకు రాకపోకల సౌకర్యం కల్పించారన్నారు. వైకాపా రాష్ట్ర కార్యదర్శి కూటమి నాయకుల పై విమర్శలు చేస్తున్నారని. వైకాపా పాలనలో కోట్లాది రూపాయల వెచ్చించి నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ నుంచి ఒక్క చుక్క నీరు పట్టణ ప్రజలకు ఇవ్వలేని ఘనత వైకాపా నాయకులదే అన్నారు.