ఒంగోలు అర్బన్: ఒంగోలు గోపాల్ నగర్ లో దారుణం.క్షుద్ర పూజలతో చిన్నారి హత్య
Ongole Urban, Prakasam | Jul 14, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని గోపాల్ నగర్ లో దారుణం వెలుగు చూసింది క్షుద్ర పూజలతో చిన్నారిని చిత్రహింసలు పెట్టి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది నెల్లూరుకు చెందిన ఒక మహిళ గోపాల్ నగర్ కు చెందిన కిరణ్ లతల దివ్యాంగ కుమారుడు రుత్విక్ కు కాళ్లు తెప్పిస్తానని నమ్మించి క్షుద్ర పూజలు నేపథంతో తీవ్రంగా వారం రోజులపాటు కట్టేసి కొట్టి హింసించింది ఈ హింస తట్టుకోలేక చిన్నారి మృతి చెందాడు తర్వాత కూడా చిన్నారిని పూజ చేసి బతికిస్తానంటూ కుటుంబ సభ్యులు నమ్మించింది అయితే స్థానికులు అది గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహంతో సహా కుటుంబ సభ్యులు పూజలు చేసిన మహిళా కూడా పరారయ్యారు