ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి మిర్రర్లు ఏర్పాటు చేస్తున్న పోలీసులు
Ongole Urban, Prakasam | Apr 16, 2026
ఉమ్మడి జిల్లాలో రోడ్డు ప్రమాదల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. గురువారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో మూల మలుపులు ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో పోలీసులు మిర్రర్లు ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ప్రమాదాలు నివారణకు మిర్రర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దాదాపు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 150 కి పైగా అధికారులు మిర్రర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు.