చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మంగళం గ్రామ సచివాలయ సర్వేయర్ శ్రీరాములుపట్టణానికి చెందిన ఉమా శంకర్ వద్ద బుధవారం 20వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు పట్టుబడ్డారు. ఉమా శంకర్ మంగళం గ్రామం వద్ద 20 సెంట్లు భూమి కొనుగోలు చేసి భూమి సర్వే చేసి పాసుబుక్కులు మంజూరు చేయాలని సర్వాయర్ శ్రీరాముల తో సంప్రదించారు. పాసుబుక్కులు సర్వే చేయడానికి సర్వేయర్ శ్రీరాములు 50000 రూపాయలు డిమాండ్ చేశాడు.ఉమాశంకర్ అంత ఇవ్వలేనని 35వేలకు ఒప్పందం చేసుకున్నారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని ఉమాశంకర్ ఏసీబీ అధికారులకు సమాచారం తెలిపారు .