ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలో సత్యం మెత్తటి దోశ హోటల్ ధ్వంసం, రూ.10 లక్షలు నష్టం, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
Ongole Urban, Prakasam | Apr 4, 2026
ఒంగోలు పట్టణంలోని సత్యం మెత్తెటి దోశ హోటల్ ను రాత్రికి రాత్రి ధ్వంసం చేశారని బాధితులు వాపోయారు. స్థల యజమానితో 10 సంవత్సరాలకు హోటల్ యజమాని ఒప్పందం చేసుకున్నాడు. ఈ సంవత్సరం జనవరికి ఒప్పందం కూడా ముగిసింది. అయితే హోటల్ యజమాని విజ్ఞప్తి మేరకు స్థల యజమాని మరో మూడు నెలలు హోటల్ పెట్టుకునేందుకు అవకాశం ఇచ్చాడు. వేరే చోట స్థలం తీసుకున్నారని మరొక నెల రోజులు ఉండేందుకు అవకాశం ఇవ్వాలని యజమానిని హోటల్ యజమాని విజ్ఞప్తి చేశాడు. అయితే శుక్రవారం రాత్రి తర్వాత డోజర్ తీసుకోవచ్చి హోటల్ ను ధ్వంసం చేసినట్లు బాధితులు వాపోయారు. రూ.10 లక్షలు ఆర్థికంగా నష్టపోయామని హోటల్ యజమాని తెలిపాడు.