చేవెళ్లలో ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, విద్యా రంగ సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. స్కాలర్షిప్లు భిక్ష కాదు.. తమ హక్కు అని, సమస్యలు పరిష్కరించకుంటే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.