నిజామాబాద్ సౌత్: హైదరాబాద్ లిబరేషన్ డే ఫోటో ఎగ్జిబిషన్" ను ప్రారంభించిన 12(T) బెటాలియన్ ఎన్.సి.సి. కమాండింగ్ ఆఫీసర్ లెఫ్ట్నెంట్ కల్నల్
హైదరాబాద్ విమోచనం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని 12(T) బెటాలియన్ NCC కమాండింగ్ ఆఫీసర్ లెఫ్ట్నెంట్ కల్నల్ ప్రియాజిత్ సూర్ తెలిపారు.మంగళవారం నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల గ్రౌండ్లో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లిబరేషన్ డే ఫొటో ఎగ్జిబిషన్ ను 12(T) బెటాలియన్ NCC కమాండింగ్ ఆఫీసర్ లెఫ్ట్నెంట్ కల్నల్ ప్రియాజిత్ సూర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) హైదరాబాద్ లిబరేషన్ డే ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు