ఆత్మకూరు: అమరచింత:మున్సిపల్లో జరిగిన అవినీతిపై ఇప్పటికైనా పాలకులైన మున్సిపల్ చైర్మెన్ గ్రహించి నైతిక బాధ్యత వహించాలి.. కౌన్సిలర్స్
అమరచింత మున్సిపల్ లో జరిగిన అవినీతిపై ఇప్పటికైనా పాలకులైన మున్సిపల్ చైర్మెన్ గ్రహించి నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కౌన్సిలర్లు పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ కౌన్సిలర్ విజయ రాములు, బిజెపి కౌన్సిలర్ లావణ్య ,టిఆర్ఎస్ కౌన్సిలర్లు రాజశేఖర్ రెడ్డి, సింధు లు సాయంత్రం నాలుగు గంటలకు కలిసి మాట్లాడారు. మున్సిపల్ లో ఇప్పటివరకు 18 కోట్లు నిధులు అభివృద్ధి కోసం వస్తే అందులో సగం అవినీతి జరిగిన విషయం వాస్తవం తాము చేసినా ఆరోపణకు కట్టుబడి ఉన్నామని వారన్నారు