బనగానపల్లె: బనగానపల్లెలో వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు అరాచక పాలన సాగింది :మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
బనగానపల్లె నియోజకవర్గంలో వైసీపీ ఐదేళ్లలో పాలనలో అరాచక పాలన సాగిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. వైసీపీ నాయకులు తమపై ఎన్నో కేసులు పెట్టారని, తమను అనగదొక్కాలని చూస్తే చంద్రబాబు స్ఫూర్తితో నియోజకవర్గంలో జెండా ఎగరవేశామని అన్నారు. ముఖ్యమంత్రి ఎదుట వైసీపీ నాయకులపై మంత్రి బీసీ నార్దన్ రెడ్డి ధ్వజమెత్తారు.బనగానపల్లె నియోజకవర్గానికి ఆర్డీవో ఆఫీస్ మంజూరు చేసి బనగానపల్లె ప్రజల కోరిక నెరవేర్చారనిమంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నియోజవకవర్గంలో బైపాస్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 70 శాతం పూర్తయ్యాయని తెలిపారు