డోన్: డోన్ లో టిడిపి సీనియర్ నాయకుడు తల్లి మృతి నివాళులర్పించిన ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Jun 29, 2026 డోన్ పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు అర్షద్ తల్లి మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి నివాసానికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.