బాల్కొండ: హసకోత్తూరు గ్రామంలో సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు
కమ్మర్పల్లి మండలంలోని హసకోత్తూర్ గ్రామంలో ఆరోగ్య విస్తరణ అధికారి సత్యనారాయణ ప్రజలను సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం చౌట్పల్లి ఆస్పత్రి సిబ్బంది, ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి, పరిసరాలలో చెత్త, మురుగునీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు.