భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 19న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు పలువురు ప్రముఖులు పుట్టపర్తి రానున్నారు.ఈ పర్యటన ఏర్పాట్లపై సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ నోడల్ అధికారులు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ అన్ని శాఖల అధికారులు ఎమ్మెల్యే సింధూర రెడ్డి, సత్య సాయి ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.