ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Ongole Urban, Prakasam | Apr 15, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రాయవరం వెలుటూరు గ్రామాలలో పేకాట ఆడుతున్న 9 మందిని బుధవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.5000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పేకాట ఆడుతున్న వారిని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశామని పేకాట ఆడుతుంటే ఎక్కడన్నా గుర్తించిన వారు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.