అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం బీ కొత్తకోట మండలం బాలస్వామి వారి పల్లె గ్రామంలో వీధి కుక్కల గుంపు దాడిలో 60 గొర్రె పిల్లల మృతి చెందిన ఘటన శనివారం రాత్రి వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు గ్రామానికి చెందిన బాబు గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడని. శనివారము గొర్రెల దొడ్డిలో కుక్కలు గుంపు గురి దాదాపు 60 గొర్రెలను హతమార్చాయని స్థానికులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.