అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని అతి పురాతన ప్రసిద్ధి చెందిన గుత్తి కోటకు సంబంధించి 2026 జనవరి 24, 25 తేదీలలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించనున్నట్టు అనంతపురం జిల్లా టూరిజం అధికారి జయకుమార్ తెలిపారు. గుత్తి కోట ఉత్సవాల నిర్వహణలో భాగంగా శనివారం గుత్తి మునిసిపల్ కార్యాలయంలో కమిషనర్ జబ్బార్ మియా ఆధ్వర్యంలో కోట ఉత్సవాల నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గుత్తి కోటలో 2026 జనవరి 24, 25 తేదీలలో గుత్తి కోట ఉత్సవాలకు సంబంధించి విధి విధానాలు, మార్గదర్శకాల గురించి సమావేశంలో చర్చించారు. అనంతరం ఉత్సవాల నిర్వహణకు ఫుట్ బాల్ మైదానం యం.యస్ హైస్కూల్ మైదానం పరిశీలించారు.