పటాన్చెరు: ఇంద్రేశం వద్ద రోడ్డు ప్రమాదం యువకుడు మృతి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చిట్కుల్ కు చెందిన భానూరి సురేష్ (30) తల్లి కంసమ్మ (52)తో కలిసి స్కూటీపై పోచారం వైపు వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన ఐచర్ రెడీమిక్స్ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సురేష్ తీవ్రంగా గాయపడి, ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. తల్లికి గాయాలయ్యాయి. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.