ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టుందుకే తనిఖీలన్న అధికారులు
Ongole Urban, Prakasam | Dec 2, 2025
ప్రకాశం జిల్లా మంగళవారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. మత్తు పదార్థాలు గంజాయి పేలుడు పదార్థాలు తరలింపు వంటివి అరికట్టేందుకు ఎస్పీ ఆదేశాలతో వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. అలానే అనుమానిత వ్యక్తులు ప్రశ్నించడంతోపాటు వారి పూర్తి వివరాలు సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు ఎస్పీ ఆదేశాలతో తనిఖీలు నిర్వహించామన్నారు.