అనుముల: రైతులను వెంటాడుతున్న యూరియా కష్టాలు, నిద్ర హారాలు మాని యూరియా గోదాముల ముందు పడిగాపులు #localissue
రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. తెల్లవారుజాము నుండే యూరియా గోదాముల ముందు నిద్రాహారాలు మాని పడిగాపులు కాస్తున్నారు. ఒక్క యూరియా భర్త కోసం రోజుల తరబడి పనులు మానుకొని తిరుగుతున్నారు. నల్గొండ జిల్లా, అనుముల మండలం, కొత్తపల్లి పిఎసిఎస్ కేంద్రం ముందు రైతులు తెల్లవారుజామున 6 గంటల నుండే క్యూ లైన్ లో చెప్పులు, ఇటుక రాళ్లు పెట్టి బారులు తీరారు. ఒక భర్త యూరియా కోసం రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు, తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతుల యూరియా కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.