కొత్తగూడెం: కొత్తగూడెం క్లబ్లో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందిస్తామన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి,కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం కొత్తగూడెం క్లబ్లో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జరిగిన కార్యక్రంమలో కూనంనేని మాట్లాడారు.పోరాటాలు చేసి ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చూపామని, ఇప్పుడు మీ అందరి అభిమానంతో ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఎంపికయ్యాయని చెప్పారు.ఈ ప్రాంత సమస్యల కోసం,ప్రజల ప్రయోజనాలు, మేలు కోసం అనునిత్యం తపిస్తున్నామని,అసెంబ్లీలోసైతం ప్రజా నమస్యలను పెద్ద ఎత్తున లేవనెత్తి ప్రాంతాలకు అతీతంగా మాట్లాడుతున్నట్లు చెప్పారు.