డోన్: బేతంచెర్ల లో ముగిసిన చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు
Dhone, Nandyal | Apr 9, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణం గౌరీపేటలో వెలసిన చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. ఈ నెల 2 నుంచి ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా పూర్ణాహుతి, పార్వేట, వసంతోత్సవ వేడుకలు నిర్వహించారు. స్వామి, అమ్మవారి కల్యాణంతో పాటు ప్రతిరోజూ వివిధ వాహనాలపై పురవీధుల్లో ఊరేగింపు చేపట్టారు. గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తొలిసారిగా ఊంజల సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు.