ఒంగోలు అర్బన్: ' మీకోసం ' అర్జీల పరిష్కారానికి జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి :కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jul 13, 2026
' మీకోసం ' అర్జీల పరిష్కారానికి జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. సోమవారం ప్రకాశం భవనంలో నిర్వహించిన ' మీకోసం ' కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డిఆర్ఓ వెంకటరమణ, డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి, డిపిఓ అనుపమ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి చిరంజీవి తదితర అధికారులతో కలిసి ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 261 అర్జీలు వచ్చాయి. వీటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.