జహీరాబాద్: గ్రూప్ వన్ ఉద్యోగం సాధించిన పట్టణానికి చెందిన సాహితి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి చెందిన ధనుర్ సాహితి గ్రూప్ వన్ ఉద్యోగం సాధించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ వన్ సర్వీస్ లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసర్ గా నియామకమైంది. పట్టణంలోని దత్తగిరి కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్, సంధ్యారాణిల కూతురు సాహితి మొదటి నుండి జహీరాబాద్ లోని విద్యాభ్యాసం చేసింది. సాహితి గ్రూప్ వన్ ఉద్యోగం సాధించడం పట్ల కుటుంబ సభ్యులు పట్టణవాసులు సంతోషం వ్యక్తం చేశారు.