రాజేంద్రనగర్: భారీ వర్షాలకు కొట్టుకుపోయిన హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డు
మొంథా తుఫాన్ ప్రభావంతో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాలు నిండుకుండాల మారాయి. అధికారులు గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్‌సాగర్ ORR సర్వీస్ రోడ్డు ఎగ్జిట్-17 వద్ద ప్రవాహ ఉద్ధృతికి రోడ్డు కొట్టుకుపోయింది. నీరు రోడ్డుపై నుండి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటువైపు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.