జహీరాబాద్: పట్టణంలో ప్రారంభమైన అంతర్రాష్ట్రియ భజన పోటీలు, అలరించిన ఉద్గిర్ అంద కళాకారులు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అంతరాష్ట్రయ భజన పోటీలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ, భవాని భజన మండలి ఆధ్వర్యంలో భవాని మందిర్ ఆలయ ప్రాంగణంలో మంగళవారం రాత్రి భజన పోటీలను ప్రారంభించారు. మొదటి రోజు వికారాబాద్ జిల్లా, మహారాష్ట్ర లోని ఉద్గిర్ చెందిన భజన టీంలు పోటీల్లో పాల్గొన్నాయి. ఉద్గిర్ సూర్ రాజ్ టీం కు చెందిన ముగ్గురు అంద కళాకారులు ఆలపించిన భక్తి కీర్తనలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, పట్టణ, పరిసర ప్రాంత భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.