జహీరాబాద్: రైల్వే స్టేషన్ లో అమృత్ భారత్ పనులను పరిశీలించిన డిఆర్ఎం గోపాలకృష్ణ
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రైల్వే స్టేషన్ ను దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎం గోపాలకృష్ణ సందర్శించారు. మంగళవారం సాయంత్రం పట్టణ రైల్వే స్టేషన్ లో కొనసాగుతున్న అమృత్ భారత్ పనులను తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలతో అమృత్ భారత్ పనులు నేమ్మదించాయని తెలిపారు. వర్షాలు తగ్గగానే త్వరతగతిన పనులను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పలు నూతన రైళ్ల కోసం స్థానికులు ఇచ్చిన వినతులను స్వీకరించి పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా స్థానిక స్టేషన్ సిబ్బంది డి ఆర్ ఎం ను ఘనంగా సత్కరించారు.