ఎడపల్లి: ఉమ్మడి వర్ని మండలంలో ఘనంగా శివాజీ జయంతి ఉత్సవాలు, భారీగా పాల్గొన్న యువత
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సోమవారం ఉమ్మడి వర్ని మండలంలోని ఆయా గ్రామాల్లో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మోస్రా మండలంలోని గోవుర్, రుద్రూర్ మండల కేంద్రంలో, కోటగిరి మండల కేంద్రంలో శివాజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రుద్రూర్ మండల కేంద్రంలో యువకులు భారీ ర్యాలీ నిర్వహించారు.